న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి స్థూల రుణాలు రూ.1.57 లక్షల కోట్లకు ఎగశాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21.81 శాతం వృద్ధి అని బ్యాంక్ తెలిపింది. డిపాజిట్లు 11.69 శాతం అధికమై రూ.2.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్‌ఏ) 52.50 శాతంగా ఉంది. 2022 డిసెంబర్ చివరినాటికి మొత్తం వ్యాపారం 15.83% వృద్ధి చెంది రూ.3.65 లక్షల కోట్లను నమోదు చేసింది.
చదవండి: పేటీఎం యూజర్లకు బంపరాఫర్
Comments
Please login to add a commentAdd a comment