రీసైక్లింగ్‌ పరిశ్రమ @ 20 బిలియన్‌ డాలర్లు! | Battery, E-waste, Plastic To Be A 20bn dollers Market says Avendus Capital Report | Sakshi
Sakshi News home page

రీసైక్లింగ్‌ పరిశ్రమ @ 20 బిలియన్‌ డాలర్లు!

Jun 10 2023 4:37 AM | Updated on Jun 10 2023 12:10 PM

Battery, E-waste, Plastic To Be A 20bn dollers Market says Avendus Capital Report - Sakshi

ముంబై: వ్యర్థాల శుద్ధి పరిశ్రమ (రీసైక్లింగ్‌) 2030 నాటికి 20 బిలియన్‌ డాలర్లకు (రూ.1.64 లక్షల కోట్లు) విస్తరిస్తుందని అవెండస్‌ క్యాపిటల్‌ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ పరిమాణం 4 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. అంటే ఏడేళ్లలో ఐదు రెట్లు పెరగనుంది. వ్యయాలను ఆదా చేయడం, అసలైన మెటీరియల్స్‌పై ఆధారపడడం దీనివల్ల తగ్గుతుందని పేర్కొంది. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమ ప్రస్తుతం 2.3 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల పరిమాణం 1.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. బ్యాటరీ రీసైక్లింగ్‌ 100 మిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.

ఈ మూడు విభాగాలు కలసి 2030 నాటికి 20 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటాయని తన తాజా నివేదికలో అ వెండస్‌ క్యాపిటల్‌ పేర్కొంది. రీసైక్లింగ్‌ మెటీరియల్‌ వినియోగం వల్ల సహజ వనరుల క్షీణత తగ్గుతుందని తెలిపింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల శుద్ధి పరిమాణం ఏటా 24 శాతం చొప్పున పెరుగుతూ 2030 నాటికి 10.2 బిలియన్‌ డాలర్ల స్థాయి విలువకు చేరుకుంటుందని అవెండస్‌ క్యాపి టల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆశిష్‌ అహుజా తెలిపారు. ఈ వేస్ట్‌ రీసైక్లింగ్‌ ఏటా 23 శాతం చొప్పున పెరుగుతూ ఇదే కాలంలో 7.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నారు. ఇక ప్రస్తుతం 100 మిలియన్‌ డాలర్లుగానే ఉన్న బ్యాటరీ వ్యర్థాల రీసైక్లింగ్‌ 2 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement