స్పిరిట్ ఏరోసిస్టమ్స్‌ను.. బోయింగ్ సంస్థ సుమారు రూ.39 వేలకోట్లకు కొనుగోలు చేయనుంది. దీనికోసం సంస్థ నెల రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ముగిసిన తరువాత.. రెండు కంపెనీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో బోయింగ్ సంస్థ స్పిరిట్ ఏరోసిస్టమ్స్ కొనుగోలును ధ్రువీకరించింది.
బోయింగ్ సంస్థ కొనుగోలు చేసిన ఈక్విటీ వాల్యూ 4.7 బిలియన్ డాలర్లు కాగా.. ఒక్కో షేరుకు 37.25 డాలర్లు. డీల్ మొత్తం విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇందులో ఇందులో స్పిరిట్ చివరిగా నివేదించిన నికర రుణం కూడా ఉందని ఏరోస్పేస్ పేర్కొంది. షేర్ వాల్యూ అనేది డీల్ ముగిసే ముందు షేర్ ధర సగటుపై ఆధారపడి ఉంటుంది.
కొనసాగుతున్న భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బోయింగ్ స్పిరిట్ ఏరోసిస్టమ్స్‌ను కొనుగోలు చేయడానికి సన్నద్దమైందని తెలుస్తోంది. కాన్సాస్‌లోని విచితాలో ఉన్న స్పిరిట్, బోయింగ్ విమానాలకు సంబంధించిన కీలక భాగాలను తయారు చేస్తుంది. రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం మా ఎయిర్‌లైన్ కస్టమర్‌లకు, స్పిరిట్, బోయింగ్ ఉద్యోగులకు, మా షేర్‌హోల్డర్లకు, దేశానికి ఉపయోగకరంగా ఉంటుందని బోయింగ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేవ్ కాల్‌హౌన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment