అమెరికాలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ ట్విటర్ వేదికగా స్పందించారు. భారతప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. మస్క్ పర్యటనకు డేట్ కూడా ఫిక్స్ అయిందని, ఏప్రిల్ 22న భారత్ రాబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది.
ప్రధానితో భేటీలో భాగంగా భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మస్క్ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే.
Looking forward to meeting with Prime Minister @NarendraModi in India!
— Elon Musk (@elonmusk) April 10, 2024
ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాటు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది.
ఇదీ చదవండి: వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం
ఏం జరగబోతుంది..
కొత్త ఈవీ పాలసీ నిబంధనల ప్రకారం ఒకవేళ భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తే స్థానికంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. కార్ల తయారీలో ముడిసరుకు అందిస్తున్న ఇండియన్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు వస్తాయి. ప్రధానంగా బ్యాటరీ తయారీ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, వైరింగ్ పరిశ్రమలోని కంపెనీలు, టైర్ సంస్థలు లాభపడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు టెస్లా భారత్‌లో తయారీ ప్లాంట్ పెట్టే యోచనలో ఉంటే ఏ రాష్ట్రంలో దాన్ని ప్రారంభిస్తారనే చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి. ఏదేమైనా మస్క్ పర్యటనతో ఒక స్పష్టత రాబోతుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment