న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల తాజా సరఫరాలు నిర్వహించే నింజాకార్ట్‌లో తాజాగా వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ 14.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 1,090 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది అక్టోబర్‌లోనూ ఈ బెంగళూరు కంపెనీలో వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ పైకి వెల్లడించని పెట్టుబడులు సమకూర్చడం గమనార్హం.
మౌలిక సదుపాయాలు
ఈ నిధులతో తాజా ఉత్పత్తుల సప్లై చైన్ కంపెనీ నింజాకార్ట్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచుకోనుంది. తద్వారా రైతులు, రీసెల్లర్లు, రిటైలర్లు, వినియోగదారులు, సరఫరాదారులకు మరిన్ని సౌకర్యాలు సమకూరే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా మరింత మంది రిటైలర్లు, వినియోగదారులకు అత్యంత నాణ్యతతోకూడిన తాజా ఉత్పత్తులను అందించేందుకు కొత్తగా లభించిన పెట్టుబడులు దోహదం చేయనున్నట్లు వివరించింది. ఇది రైతులకు సైతం ఉత్తమ ఆదాయ సాధనకు సహకరించనున్నట్లు తెలియజేసింది. 2015లో ప్రారంభమైన నింజాకార్ట్ ఇప్పటికే టైగర్ గ్లోబల్, యాక్సెల్, స్టెడ్‌వ్యూ, సింజెంటా, నందన్ నీలెకని, క్వాల్‌కామ్ నుంచి పెట్టుబడులు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment