ప్రముఖ చైనీస్ దిగ్గజ కంపెనీ హువావేకు దక్షిణాఫ్రికా గట్టి షాక్‌ను ఇచ్చింది. ఉద్యోగాల విషయంలో హువావేను కోర్టుకు లాగింది. స్థానికులను నియమించుకోవడంలో హువావే నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.
ఉద్యోగాలు పూర్తిగా నాన్ లోకల్స్‌కే..!
చైనీస్ కంపెనీ హువావే దక్షిణాఫ్రికాలో నాన్ లోకల్స్‌కు ఎక్కువ ఉద్యోగాలను ఇస్తున్నట్లు ఆ దేశ లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది. ఈ విషయంలో హువావే టెక్నాలజీస్‌కు చెందిన స్థానిక యూనిట్‌కు జరిమానా విధించాలని, అంతేకాకుండా కంపెనీ పద్దతులను మార్చుకోవాలని దక్షిణాఫ్రికా కార్మికశాఖ అక్కడి కోర్టును కోరింది. హువావేలో స్థానికంగా దాదాపు 90 శాతం మంది విదేశీ పౌరులు పనిచేస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది. ఉద్యోగుల నియామకంలో హువావే నిబంధనలను అసలు పట్టించుకోవడం లేదంటూ కార్మిక శాఖ ఆరోపించింది.
భారీ జరిమానా..!
నిబంధనలను ఉల్లఘించినందుకుగాను హువావేపై వార్షిక టర్నోవర్‌లో 2 శాతం జరిమానా విధించాలని దక్షిణాఫ్రికా కార్మిక శాఖ కోర్టును కోరింది. దీంతో హువావే సుమారు 1.5 మిలియన్ డాలర్స్‌ను చెల్లించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా జోహన్నెస్‌బర్గ్‌లోని హువావే ఫ్యాక్టరీలోని పరిస్థితులు, ఉద్యోగుల అక్రమ రవాణా వంటి విషయాలపై చైనా సంస్థపై కార్మిక శాఖ విరుచుకుపడింది. కాగా ఈ ఆరోపణలను హువావే ఖండించింది. నిబంధనలను పాటిస్తూనే ఉద్యోగుల నియమాకం జరుపుతున్నామని పేర్కొంది.
చదవండి: ఎలన్‌మస్క్‌కు గట్టిపోటీ..! దూకుడు పెంచిన ఎయిర్‌టెల్..!
Comments
Please login to add a commentAdd a comment