ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. డిమాండ్‌కు తగ్గట్లుగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సమకూర్చేందుకుగాను కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకునేందుకు సిద్దమైంది.
ఉక్రెయిన్ నో అంది రష్యాకు సై..!
భారత్‌లో సన్‌ఫ్లవర్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్దంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీ డిమాండ్ నెలకొంది. కాగా భారత్‌కు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సరఫరా చేయడం ఉక్రెయిన్ ఆపివేసింది. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతిలో భాగంగా ఉక్రెయిన్‌కు ప్రత్యామ్నాయంగా రష్యాను సంప్రదించాలని భారత్ భావించగా అందుకోసం రష్యా నుంచి 45 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసుకునేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నడూలేనంతగా రికార్డు ధరకు ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ షిప్‌మెంట్లను భారత్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
రికార్డు ధరకు సన్‌ఫ్లవర్ ఆయిల్
సన్‌ఫ్లవర్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేయండంతో భారత్ రష్యా వైపుగా వెళ్లాల్సి వచ్చిందని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి చెప్పారు. ఈ క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆల్‌టైం రికార్డు ధర ఒక టన్నుకు 2,150 డాలర్లు పలికినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వార్‌కు ముందు ఒక టన్ను సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను 1,630 డాలర్లకు భారత్ దిగుమతి చేసుకుంది.
చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై బిమ్‌స్టెక్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment