ఏఐలో భారత్‌దే హవా!.. నాస్కామ్ చైర్‌పర్సన్ | India Leads on World AI stage Says Nasscom chief Sindhu Gangadharan | Sakshi
Sakshi News home page

ఏఐలో భారత్‌దే హవా!.. నాస్కామ్ చైర్‌పర్సన్

Published Mon, Sep 30 2024 8:53 AM | Last Updated on Mon, Sep 30 2024 8:57 AM

India Leads on World AI stage Says Nasscom chief Sindhu Gangadharan

ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ బాగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు ప్రతి రంగంలోనూ ఏఐను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో నాస్కామ్ కొత్త చైర్‌పర్సన్ 'సింధు గంగాధరన్' ఏఐ గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఈ రంగంలో అగ్రగామిగా మారుతుందని అన్నారు.

ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఏఐను ఉపయోగించుకుని వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే సంస్థలో పనిచేసే సిబ్బంది మానసిక, భౌతిక పరిస్థితి మెరుగ్గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలకు ఉందని సింధు గంగాధరన్ పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతోందన్న ప్రచారాన్ని తగ్గించాలి, కాబట్టి ఉద్యోగిపై కూడా కొంత శ్రద్ద వహించాలని అన్నారు.

ఇటీవల ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలో ఒక యువ ఉద్యోగి మరణించిన నేపథ్యంలో గంగాధరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్పొరేట్ ఇండియాలో పని ప్రదేశాలలో అధిక ఒత్తిడి గురించి చర్చ మొదలైంది. ఏఐ నైపుణ్యం భారత్ తన ప్రతిభను నిరూపించుకుంటుందని చెబుతూ.. రాబోయే రోజుల్లో ఇండియా 'జీసీసీ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్'గా నిలుస్తుందని సింధు గంగాధరన్ అన్నారు.

ఇదీ చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి

ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాల గురించి మాట్లాడుతూ.. టెక్నాలజీ ఉత్పాదకతలో లాభాలను, కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని అన్నారు. అయితే ఉద్యోగులు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అప్పుడు టెక్నాలజీ మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement