పెట్టుబడులకు నేడు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) కోసం ఈ యాప్స్‌ను నమ్ముకోవచ్చా?ఎందుకంటే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్‌ల గురించి పెద్దగా తెలియదు కదా? – రాజేంద్ర
ఈ యాప్స్ గురించి ఆందోళన చెందకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ పెట్టుబడులు నిజంగా ఎంపిక చేసుకున్న పథకంలోకి వెళ్లిందీ, లేనిదీ కూడా పరిశీలించుకోవచ్చు. గత వారమే ‘మ్యూచువల్ ఫండ్ సెంట్రల్’ ప్రారంభమైంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్స్ (ఆర్‌టీఏలు)గా పనిచేస్తున్న కేఫిన్ టెక్నాలజీస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థలు మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ పోర్టల్‌ను ఏర్పాటు చేశాయి. మీరు ఏ యాప్ నుంచి ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ పోర్టల్‌పై ఆ పెట్టుబడులను తనిఖీ చేసుకోవచ్చు. మీ పాన్, ఫోన్ నంబర్ సాయంతో మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ పోర్టల్ నుంచి పెట్టుబడుల వివరాలను ఎప్పుడైనా సరిచూసుకోవచ్చు. గ్రోవ్, ఈటీమనీ, పేటీఎం మనీ, జెరోదా కాయిన్ లేదా మరో యాప్ అయినా కానీయండి.. మీ పెట్టుబడులకు సంబంధించిన నిధులను అవి ఉంచుకోవు. ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే ఆ నిధి మొత్తాన్ని తిరిగి మీకు జమ చేయాల్సి ఉంటుంది. కనుక యాప్స్ నుంచి పెట్టుబడుల విషయమై మీరు ఆందోళన చెందక్కర్లేదు.
మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లలో ఉన్న పెట్టుబడులను డైరెక్ట్ ప్లాన్లలోకి మార్చుకోవచ్చా?
–కే ఘోష్
రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో వ్యయాలు తక్కువగా ఉంటాయి. సెబీ నిబంధనల ప్రకారం చూస్తే.. రెగ్యులర్ ప్లాన్లలో ఉండే డిస్ట్రిబ్యూటర్ల కమీషన్‌ను మినహాయించగా మిగిలిన మేర వ్యయాలు డైరెక్ట్ ప్లాన్లలో ఉంటాయి. నూతన పథకాల్లో రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్ల మధ్య ఎక్స్‌పెన్స్ రేషియో అంతరం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫండ్స్ సంస్థలు డీలర్లకు ఎక్కువ కమీషన్ పంపిణీ చేయడం వల్లే ఇలా అధికంగా ఉండొచ్చు. డైరెక్ట్ ప్లాన్లలో ఉండే తక్కువ వ్యయాల ప్రయోజనం.. ఐదు, పదేళ్ల కాలంలో స్పష్టంగా కనిపిస్తుంది. డైరెక్ట్ ప్లాన్లకు మారిపోవడం వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనం ఇది. కాకపోతే రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్లకు మారిపోయే ముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇలా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, తిరిగి ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. అదే పథకంలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ వాటిని కొత్త పెట్టుబడులుగానే పరిగణిస్తారు. కనుక అప్పటి వరకు వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఈక్విటీ పథకాల విషయంలో 1–2 శాతం ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే ఈ ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. కనుక డైరెక్ట్ ప్లాన్లకు మారిపోవాలనుకుంటే ఏడాది పూర్తికాని పెట్టుబడులను వెనక్కి తీసుకోకపోవడమే మంచిది.
వ్యాల్యూ ఫండ్, ఫోకస్డ్ ఫండ్ మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? సేవింగ్స్ బ్యాంకు ఖాతాలోని డిపాజిట్‌పై వడ్డీ ప్రతీ నెలా వస్తుందా లేక మూడే నెలలకు ఒక పర్యాయమా? – ఆశిష్
సేవింగ్స్ బ్యాంకు ఖాతా డిపాజిట్‌పై వడ్డీని రోజువారీగా లెక్కిస్తారు. కానీ, ఆ వడ్డీని మూడు నెలలకు ఒకసారి జమ చేస్తుంటాయి బ్యాంకులు. ఇక మీరు అడిగిన మరో ప్రశ్నను చూస్తే.. ఫోకస్డ్ ఫండ్ అన్నది వైవిధ్యమైన ఈక్విటీ పథకం. పరిమితంగా ఎంపిక చేసుకున్న భిన్న రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వ్యాల్యూ ఫండ్ పనితీరు వేరు. మార్కెట్ ర్యాలీలో పెద్దగా పాల్గొనని కంపెనీలు, అంతర్గత విలువతో పోలిస్తే తక్కువ ధరలకు లభించే కంపెనీల్లో వ్యాల్యూ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి.
- ధీరేంద్ర కుమార్, సీఈవో , వ్యాల్యూ రీసెర్చ్
చదవండి : ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే
Comments
Please login to add a commentAdd a comment