
జెనరిక్ మెడిసిన్ విభాగంలో ప్రఖ్యాతి చెందిన జాంప్ ఫార్మా తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. జాంప్ ఫార్మా విస్తరణలో భాగంగా సుమారు రూ.250 కోట్లతో నిర్మించిన ఎక్స్‌లెన్సీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. కెనడా వెలుపల జాంప్‌కి ఇదే తొలి సెంటర్. ఈ సెంటర్ ఆరంభం కావడంతో షార్మా రంగంలో కొత్తగా రెండు వందల మందికి ఉపాధి లభించనుంది.
జాంప్ సంస్థ తొలి దశలో వంద కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ సంస్థ ఉత్పత్తిలో 25 శాతం హైదరాబాద్ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ ఫలితాలు బాగుండటంతో హైదరాబాద్ విస్తరించాలని ఆ సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సెంటర్‌లో ఓరల్ డోసేజ్ మెడిసిన్స్‌కి సంబంధించిన కార్యకలాపాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment