ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రెజ్యూమ్‌లు తయారు చేస్తున్నారా? వాటి సాయంతో ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్తా. ఏఐ సాయం తీసుకుని వేలాది కంపెనీలకు ధరఖాస్తు చేసుకున్నా ఒక్క ఉద్యోగం దొరకడం లేదు.
ఆర్ధిక మాంద్యం భయాలు, లేఆఫ్స్, ప్రాజెక్ట్‌ల కొరత.. ఇలాంటి కఠిన సమయాల్లో నచ్చిన కంపెనీలో కోరుకున్న జాబ్ పొందడం అంటే అంత సులభం కాదు. అయినప్పటకీ ఓ ఐటీ ఉద్యోగి జాబ్ కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఫలితంగా..
యూజర్ ఇంటర్‌ఫేస్ ఆటోమెషిన్‌లో విధులు నిర్వహించే జూలియన్ జోసెఫ్ రెండేళ్లలో రెండు సార్లు ఉద్యోగం (లేఆఫ్స్) పోగొట్టుకున్నాడు. ప్రయత్నాల్ని విరమించకుండా కొత్త జాబ్‌కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవంలందించే ‘లేజీ అప్లయ్’ వెబ్‌పోర్టల్‌ని ఆశ్రయించాడు.
లేజీ అప్లయ్‌లో ఏఐ జాబ్‌జీపీటీ అనే సర్వీసులున్నాయి. దీని సాయంతో నెలకు 250 డాలర్లు వెచ్చించి సింగిల్ క్లిక్‌తో వేలా ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. కేవలం అభ్యర్ధి వివరాలు ఇస్తే సరిపోతుంది. జోసెఫ్ అదే పనిచేశాడు.
ఉద్యోగం కోసం తన స్నేహితురాలి ల్యాప్ ట్యాప్ తీసుకుని రేయింబవళ్లు శ్రమించి 5వేల ఉద్యోగాలకు అప్లయ్ చేసుకున్నాడు. ఆపై కంగుతినడం జోసెఫ్ వంతైంది. ఎందుకంటే? వేలాది సంస్థల్లో ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకుంటే.. కేవలం 20 సంస‍్థలనుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి.
పైగా తాను మ్యానువల్‌గా 300 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే 20 ఇంటర్య్యూ కాల్స్ వచ్చాయని జోసెఫ్ తెలిపాడు. కొన్ని సార్లు అప్లికేషన్‌లోని ప్రశ్నలకు ఈ ఏఐ సంబంధం లేని సమాధానాలను అందిస్తుండటడంతో స్పందన కరువైంది. సమయం ఆదా అయినప్పటికీ ఏఐ సాయంతో సక్సెస్ రేటు తక్కువే అని జోసెఫ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాబట్టి, ఇంటర్వ్యూల కోసం సన్నద్ధమవుతున్న ఉద్యోగులు ఏఐలాంటి టూల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని టెక్నాలజీ నిపుణులు సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment