టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు ప్రతి రంగంలోనూ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) హవా జోరుగా సాగుతోంది. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన కోర్సును నేర్చుకోవడానికి ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' అమెరికా వెళ్లినట్లు తెలిసింది.
టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే కుతూహలం ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు అమెరికాలో ఓ టాప్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కోర్సు వ్యవధి 90 రోజులు ఉన్నప్పటికీ కమల్ 45 రోజులు ఈ కోర్సు నేర్చుకోవడానికి సమయం కేటాయించనున్నట్లు సమాచారం.
ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్.. ఏఐ నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లడం చాలా గొప్ప విషయం. టెక్నాలజీ పట్ల ఆయనకు ఎంత మక్కువ ఉందో తెలుసుకోవడానికి ఇదోక ఉదాహరణ. కొత్త నైపుణ్యాలు భారతీయ సినిమాపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, ఏఐ చిత్రనిర్మాణంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని చాలామంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలు
కమల్ హాసన్ సన్నిహితుల ప్రకారం.. భవిష్యత్తులో నిర్మించే ఆయన ప్రాజెక్టులు ఏఐ సాంకేతికతతో వస్తాయని తెలుస్తోంది. తనకు కొత్త టెక్నాలజీ మీద అమితమైన ఆసక్తి ఉందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే కమల్ సినిమాలలో ఏఐ టెక్నాలజీ ఉందనునందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment