ఆన్‌లైన్ మిల్క్, గ్రోసరి డెలివరీ సంస్థ మిల్క్‌బాస్కెట్ ఉద్యోగుల్ని తొలగించనుందంటూ వస్తున్న నివేదికలపై ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ స్పందించింది. గ్రోసరీ డెలివరీ సంస్థలో ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది.
రియలన్స్ సంస్థ 2021లో మిల్క్ బాస్కెట్‌ను 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ సంస్థ ఈ మిల్క్ బాస్కెట్‌ను తన రీటైల్ సంస్థ జియో మార్ట్‌లో కలపనుందని పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
ఇంటిగ్రేట్‌లో భాగంగా గ్రోసరీ డెలివరీకి చెందిన ఉద్యోగుల స్థానాల్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు మిల్క్ బిస్కెట్ ప్రతినిధి తెలిపారు. అంతే తప్పా ఉద్యోగుల్ని తొలగించడం లేదని అన్నారు. లేఆఫ్స్‌పై వస్తున్న నివేదికల్ని కొట్టి పారేశారు. ఈ సందర్భంగా ‘మిల్క్ బిస్కెట్ ప్రస్తుతం, 24 నగరాల్లో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. టైర్-1 సిటీల్లో డైలీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల్ని అందించడమే తమ లక్ష్యమని’ పేర్కొన్నారు.
ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, రిలయన్స్ మిల్క్‌బాస్కెట్ బ్రాండింగ్‌ను రీటైల్ విభాగంలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కొంత కాలం మిల్క్‌బాస్కెట్ బ్రాండ్గా కొనసాగనుంది.
మిల్క్ బాస్కెట్‌ను విడిచి పెట్టిన
ఇటీల మిల్క్ బాస్కెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యతీష్ తల్వాడియా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ ఇమండీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గౌరవ్ శ్రీవాస్తవ కంపెనీని విడిచిపెట్టారు. సంస్థను విడిచిపెట్టిన చివరి కోఫౌండర్ తల్వాడియా కాగా, ఇతర సహ వ్యవస్థాపకులు ఆశిష్ గోయెల్, అనురాగ్ జైన్, అనంత్ గోయెల్‌లు 2021లో ఆ సంస్థను రియలన్స్ కొనుగోలు చేసిన తర్వాత నిష్క్రమించారు. కాగా, మిల్క్ బాస్కెట్‌లో మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment