న్యూఢిల్లీ: మొండి రుణ ఖాతాను (ఎన్‌పీఏ) స్టాండర్డ్ ఖాతాగా మార్చే విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాల అమలు గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబర్‌లో ఈ మార్గదర్శకాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ప్రకటించడం గమనార్హం.
వీటి అమలుకు 2021 డిసెబంబర్ 31 వరకు ఇచ్చిన గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీలు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్గదర్శకాల కింద బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎన్‌పీఏగా గుర్తించిన ఏదైనా ఖాతాను తిరిగి స్టాండర్డ్ ఖాతాగా (సకాలంలో చెల్లింపులు చేసే) మార్చొచ్చు. సదరు ఎన్‌పీఏ ఖాతాదారు పూర్తి రుణం, వడ్డీ చెల్లింపులు చేసినట్టయితేనే ఇలా చేయడానికి అనుమతించింది.
కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎన్‌పీఏ ఖాతాలను కేవలం వడ్డీ చెల్లింపులు చేసిన వెంటనే స్టాండర్డ్‌గా మారుస్తున్నట్టు ఆర్‌బీఐ దృష్టికి వచ్చింది. దీంతో కేవలం వడ్డీ కాకుండా, అసలు రుణ బకాయిలు చెల్లించిన వాటినే అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment