
బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బంగారం ధరలు సమీప భవిష్యత్తులో రూ.లక్షకు చేరుకోనుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకుగల కారణాలను మార్కెట్ నిపుణులు, అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో సెంట్రల్ బ్యాంకులు ఫారెక్స్ నిలువలు అమ్మేశాయి. దాంతో గ్లోబల్ మార్కెట్‌లో బంగారాన్ని అమ్మి డాలర్లతో దేశాలకు కావాల్సిన ముడిచమురు వంటి కీలక అవసరాలను తీర్చుకున్నాయి. దాంతో బంగారం నిలువలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులు తిరిగి గ్లోబల్ మార్కెట్‌లో బంగారం నిల్వలను కొనడం ప్రారంభించాయి. దాంతో గోల్డ్ ధర పెరగడానికి ఇది ఒక కారణంగా ఉంది.
ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా బంగారం పెరిగేందుకు ఒక కారణం. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇదీ బంగారం ధరల పెరుగుదలకు కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ చేస్తాం..10వేల డాలర్లు ఇస్తాం..’
యూఎస్ ఫెడ్ జూన్ నుంచే కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తాయని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంతర్జాతీయ అనిశ్చితులు, కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ పెరిగి 3.5 శాతంగా నమోదవడంతో దాన్ని వాయిదా వేస్తారని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో ఈక్విటీల్లో నుంచి సేఫ్ అసెట్‌లలోకి పెట్టుబడులను మళ్లిస్తున్నారు. 10 ఏళ్ల కాలానికిగాను యూఎస్ బాండ్ ఈల్డ్‌లు పెరుగుతుండడంతో ఈక్విటీ మార్కెట్ సమీప భవిష్యత్తులో కుప్పకూలుతాయనే సంకేతాలు బలపడుతున్నాయి. దాంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌లతో పోలిస్తే తక్కువ ఒడిదుడుకులుండే కమోడిటీ మార్కెట్‌లో ప్రధానంగా గోల్డ్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment