న్యూఢిల్లీ: జర్మనీ కంపెనీ మెట్రో ఏజీకి చెందిన దేశీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 మిలియన్ యూరోలకు (రూ.4,060 కోట్లు) సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని వారాల నుంచి డీల్‌పై మెట్రో ఏజీ, రిలయన్స్ రిటైల్ మధ్య చర్చలు నడుస్తున్నాయని, గత వారమే రిలయన్స్ రిటైల్ డీల్‌కు మెట్రో ఏజీ అంగీకారం తెలిపినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
మెట్రో క్యాష్ అండ్ క్యారీకి దేశవ్యాప్తంగా ఉన్న 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలు, భూమి, ఇతర ఆస్తులు ఈ ఒప్పందంలో భాగంగా ఉండనున్నట్టు చెప్పాయి. ఈ సమాచారాన్ని ఇరు కంపెనీల ప్రతినిధులు తిరస్కరించడం కానీ, అంగీకరించడం కానీ చేయలేదు. మార్కెట్ ఊహాగానాలపై స్పందించబోమని స్పష్టం ఏశాయి.
Comments
Please login to add a commentAdd a comment