![RRR Actress Invests in an E-Commerce Platform - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/7/alia-bhatt-RRR.jpg.webp?itok=P1JyKTpa)
RRR Actress Invests in an E-Commerce Platform: టాలీవుడైనా, బాలీవుడైనా ప్రముఖ నటినటులు అటూ సినిమాలపై దృష్టి పెడుతూనే...ఇతర వ్యాపారాలపై కూడా దృష్టిపెడుతున్నారు. కాగా తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించిన బాలీవుడ్ నటి మరోక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
భారీగా ఇన్వెస్ట్ చేసిన అలియా...!
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సీత పాత్రలో నటించిన బాలీవుడ్ నటి అలియా భట్ ప్రముఖ వెల్ల్‌నెస్ స్టార్టప్ ఫుల్.కోలో భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలియా భట్ తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తోందనుకుంటే మీరు పొరపడినట్లే...! ఈ ఆర్‌ఆర్‌ఆర్ బ్యూటీ గతంలో విమెన్ లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ నైకాలో కూడా భారీగా ఇన్వెస్ట్ చేసింది. కాగా ఎంతమేరకు నిధులను ఇన్వెస్ట్ చేసిన దానిపై సమాచారం లేదు. ఫుల్.కో లో ఇన్వెస్ట్ చేసిన అలియా భట్ మాట్లాడుతూ...వెగన్, ఎకో ఫ్రెండ్లీ, ఉత్పత్తులను తయారుచేస్తోన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు.
చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..!
పాడైపోయిన పూలతో...!
పాడైపోయిన పూలను సేకరించి వాటిని సుగంధాలను వెదజల్లే అగరబత్తుల రూపంలో, ఇతర వెల్ల్‌నెస్ ప్రొడక్ట్‌ను తయారుచేయడంలో ఫుల్.కామ్ స్టార్టప్ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ కంపెనీ డీ2సీ(డైరక్ట్ టూ కస్టమర్)సేవలను అందిస్తోంది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా కంపెనీ ఉత్పత్తులను నేరుగా సేల్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను తయారుచేయడంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఎంతగానో కృషి చేశారు. ఈ కంపెనీ పెటా నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును కూడా అందుకుంది.
చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!
Comments
Please login to add a commentAdd a comment