భారతదేశంలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నేడు ఒక తులా బంగారం కొనాలంటే రూ. 70వేలుకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. అయితే 1964 లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 63.25 రూపాయలు మాత్రమే. 60ఏళ్ళల్లో బంగారం ధరలు గణనీయంగా పెరగటానికి కారణం ఏమి? రాబోయే రోజుల్లో పసిడి ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధర పెరగటానికి కారణం
బంగారం ధరలు 1964తో పోలిస్తే 2024లో వెయ్యి రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. దీనికి కారణం దేశంలో బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువ కావడం, నిల్వలు తగ్గడం అని తెలుస్తోంది. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగల వంటి శుభకార్యాలకు బంగారం ఎక్కువగా ధరిస్తారు. దీంతో పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది.
బంగారం ధరలు పెరగటానికి, తగ్గటానికి మార్కెట్ ప్రభావం కూడా కారణం. రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, కోవిడ్ 19 వ్యాప్తి, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా బంగారం పెరిగాయి.
గతంలో బంగారాన్ని ఆభరణాలుగా మాత్రమే ఉపయోగించేవారు, కానీ నేడు గోల్డ్ అంటే ఒక ఆస్తిగా భావిస్తున్నారు. దీంతో దీనిపైన చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. క్లిష్ట పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం నుంచి బంగారం కొంత ఉపశమనం కలిగిస్తుందని భావించి చాలామంది బంగారం కోనేస్తుంటారు.
రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా?
బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగులు చేయడానికి సన్నద్ధమవ్వాలని, రాబోయే రోజులు ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జతీన్ త్రివేది అన్నారు.
1964 నుంచి 2024 వరకు బంగారం ధరలు
»1964: రూ.63.25
»1966: రూ.83.75
»1974: రూ.506.00
»1979: రూ.937.00
»1980: రూ.1,330.00
»1985: రూ.2,130.00
»1988: రూ.3,130.00
»1992: రూ.4,334.00
»2003: రూ.5,600.00
»2005: రూ.7,000.00
»2007: రూ.10,800.00
»2008: రూ.12,500.00
»2010: రూ.18,500.00
»2020: రూ.48,651.00
»2023: రూ.65,330.00
»2024: రూ.71,510.00
Comments
Please login to add a commentAdd a comment