
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ కూడా అమ్మకాల సెగ తాకుతోంది. దీంతో సెన్సెక్స 48వేలకు దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 14100 దిగువకు చేరడం గమనార్హం. ఆరంభంలో స్వల్ప లాభాలను ఆర్జించినా, అమ్మకాల ఒత్తిడితో మిడ్‌సెషన్‌లో 620 పాయింట్లకు పైగా కుప్పకూలింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 619 పాయింట్ల నష్టంతో 47733 వద్ద, నిఫ్టీ 171 పాయింట్ల నష్టంతో 14,067 వద్ద బలహీనంగా కొనసాగుతున్నాయి.
ఐటీ, టెక్నాలజీ మినహా మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీ ఒత్తిడికి లోనవుతోన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రాలు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, ఐషర్ మోటార్స్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు విప్రో, టెక్‌ఎం, ఎల్‌అండ్‌టీ మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి.