
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం తొలి ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో మొదలు పెట్టాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 66,600 పాయింట్లను తాకి తాజాగా సరికొత్త రికార్డ్‌లను నమోదు చేశాయి. తొలిసారి నిఫ్టీ 19,700 పాయింట్లను దాటింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 529.03 పాయింట్లు పెరిగి 66,589.93 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు లేదా పెరిగి 19,711.50 వద్ద ఉన్నాయి.
రిలయన్స్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. క్యూ1 లాభం 30% జంప్ చేయడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధర ఇంట్రాడే కనిష్టం నుండి పుంజుకుంది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయిందన్న ఆందోళనల మధ్య ఆసియా స్టాక్‌లు క్షీణించాయి.
మార్కెట్‌లో మరిన్ని విశేషాలు
మార్కెట్ తన రికార్డ్ ర్యాలీని కొనసాగించింది. జూలై 17న వరుసగా మూడవ సెషన్‌లో లాభాల పరంపరను కొనసాగించింది. ఆటో మినహా అన్ని రంగాల స్టాక్స్ కొనుగోళ్లు భారీ ఎత్తున జరిగాయి. దీంతో నిఫ్టీ 19,700 పై మార్క్‌ను దాటేందుకు దోహద పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
నిఫ్టీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా లాభపడగా, హీరో మోటోకార్ప్, ఒఎన్‌జిసి, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోయాయి.
బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పెరిగాయి. ఆటో మినహా, అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి