గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో నిలిచింది. సెన్సెక్స్ ఏకంగా 1,439.55 పాటింట్ల లాభంతో 82,962.71 వద్ద, నిఫ్టీ 470.40 పాయింట్ల లాభంతో 25388.90 వద్ద నిలిచాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ లాభాల్లో ముగిశాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో హిందాల్కో, భారతి ఎయిర్‌టెల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు నిలిచాయి. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, బయోకాన్, అపోలో టైర్స్, గుజరాత్ గ్యాస్, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment