
దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలున్నప్పటికీ.. దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.17 గంటల సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో 655585 వద్ద నిఫ్టీ 64 పాయింట్ల స్వల్ప లాభంతో 19420 వద్ద కొనసాగుతున్నాయి.
అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్,బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్,ఎథేర్ మోటార్స్, సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటోకార్ప్,విప్రో, హెచ్‌యూఎల్,హిందాల్కో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ ఒత్తిడికి గురవుతున్నాయి.
ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)