
నెల ప్రారంభంతో భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అదే శుభారంభంతో ముగింపు పలికాయి. ఫార్మా విభాగంలో భారీ కొనుగోళ్ల నేపథ్యంలో నిఫ్టీ 19,400 పాయింట్లకు ఎగబాకింది.
ఇక మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 555 పాయింట్ల లాభంతో 65,387 వద్ద నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 19,435 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది.
ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, మారుతి సుజికి షేర్లు భారీ లాభాల్ని గడించగా సిప్లా, హెచ్‌డీఎఫ్‌పీ, డాక్టర్ రెడ్డి లేబరేటరీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూశాయి.