
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 గంటలకు నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 21,788కు చేరింది. సెన్సెక్స్ 42 పాయింట్లు ఎగబాకి 71,782 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధర 78 డాలర్లుగా ఉంది. 10 ఏళ్ల వ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్‌లు 13 పాయింట్లు పెరిగి 4.16శాతానికి చేరాయి. ఈక్విటీ మార్కెట్లో సోమవారం ఎఫ్‌ఐఐలు రూ.518 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.1188 కోట్ల విలువగల షేర్లు విక్రయించారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)