దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 వరకు నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుని 21.991కు చేరింది. సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 72,275 వద్ద ట్రేడవుతోంది.
ఎఫ్‌ఐఐలు గురువారం ఈక్విటీ మార్కెట్‌లో రూ.3064.15 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.2276.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్‌లోని నాస్‌డాక్ బుధవారం ముగింపు సమయానికి 0.3శాతం పెరిగింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్‌ఈల్డ్‌లు 4.25శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయి 104.25 పాయింట్లకు చేరింది. క్రూడాయిల్ ధర 1.6శాతం పెరిగి బ్యారెల్ ధర 82.88 డాలర్లకు చేరింది.
గురువారం ప్రథమార్థంలో స్తబ్ధుగా కదలాడిన మార్కెట్ సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment