దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 22,577కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 74,369 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్‌డాక్ 0.23 గ్రీన్‌లో ముగిశాయి.
ఎన్‌ఎస్‌ఈ తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment