దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 22,421కు చేరింది. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 73,947 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.18 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.87 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.11 శాతం ఎగబాకింది.
త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 1.24% నష్టపోయి రూ.1,512.30 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ మార్కెట్ విలువ రూ.14,434.12 కోట్లు తగ్గి రూ.11.48 లక్షల కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో విప్రో షేరు 2.01% లాభపడి రూ.461.95 దగ్గర ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,756.93 కోట్లు పెరిగి రూ.2.41 లక్షల కోట్లకు చేరింది. ఈ రోజు బోర్డు సమావేశాలు ఉన్న కంపెనీల్లో ప్రధానంగా టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలెక్సీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్, ఎంసీఎక్స్ ఇండియా, సైయెంట్ డీఎల్‌ఎం, నెల్కో ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment