
బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 237.61 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 80,241.67 వద్ద, నిఫ్టీ 78.50 పాయింట్లు లేదా 0.32 పాయింట్ల లాభంతో 24,273.00 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, ట్రెంట్స్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) మొదలైన కంపెనీలు చేరాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టాన్ని చవి చూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 117 పాయింట్లు లేదా 0.2 శాతం లాభంతో 80,121 వద్ద ప్రారంభమైంది. కానీ వెంటనే 100 పాయింట్లకు పైగా క్షీణించి 79,879 కనిష్ట స్థాయికి దిగజారింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 20 పాయింట్లు క్షీణించి 24,170 స్థాయిల వద్ద కోట్ చేసింది.
నిఫ్టీ 50 స్టాక్స్‌లో కోల్ ఇండియా దాదాపు 2 శాతం లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ కూడా 1 శాతంపైగా పురోగమించాయి. మరోవైపు, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బీఎన్‌కే, టాటా కన్స్యూమర్ ఒక్కొక్కటి 1 శాతం క్షీణించాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment