దేశీయ మార్కెట్లో ఎంతోమంది ప్రజలకు నమ్మికైనా టాటా గ్రూప్ బెంగళూరులోని విస్ట్రాన్ ఐఫోన్ ప్లాంట్‌ను ఏప్రిల్ చివరి నాటికి కొనుగోలు చేసే అవకాశం ఉందని నివేదికల చెబుతున్నాయి. ఇదే జరిగితే యాపిల్ ఉత్పత్తుల కోసం భారతదేశం మొదటి స్వదేశీ ఉత్పత్తి శ్రేణిగా అవతరిస్తుందనటంలో సందేహం లేదు.
టాటా గ్రూప్ ఇప్పటికే ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లో కొన్ని మార్పులను చేయడం కూడా ప్రారంభించింది. అయితే ఈ ప్లాంట్ సొంతం చేసుకునే క్రమంలో సుమారు రెండు వేల మంది కార్మికులను తొలగించే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో మధ్య స్థాయి ఉద్యోగుల నుంచి, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల వరకు ఉండటం గమనార్హం.
టాటా గ్రూప్ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తరువాత ఐఫోన్ 15ను తయారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లోని ఎనిమిది ఉత్పత్తి లైన్లలో ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 14 తయారవుతున్నాయి. టాటా బెంగళూరు ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆపిల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఏకైక ప్లాంట్ విస్ట్రాన్ పూర్తిగా దేశీయ మార్కెట్‌కు దూరంగా ఉంటుంది. ఇవన్నీ టాటా గ్రూప్ సొంతమవుతాయి.
యాపిల్ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ సుమారు 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ టేకోవర్ ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆపిల్ చైనా నుండి షిఫ్ట్‌ను ప్లాన్ చేస్తోంది, ఈ కారణంగానే ఇండియాలోని ప్లాంట్ టాటా ద్రౌప్ స్వాదీనం చేసుకునే అవకాశం ఏర్పడింది.
గత ఏడాది కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో కంపెనీ చైనా, అమెరికా మధ్య విభేదాలు ఏర్పడిన కారణంగా తమ ఉత్పత్తిలో 25శాతం భారతదేశానికి మార్చాలని దాని కోసం తన ప్రణాళికలను కూడా ప్రకటించింది. మన దేశంలో ఆపిల్ ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేసే మూడు తైవాన్ కంపెనీలలో విస్ట్రాన్, పెగాట్రాన్, ఫాక్స్‌కాన్ వున్నాయి. ఇప్పుడు 'విస్ట్రాన్'లో కంపెనీ ఉత్పత్తులు నిలిపివేయగా.. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్లలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే భారతదేశంలో టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. దీనికోసం కొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఐఫోన్ కోసం పెగాట్రాన్ తయారీ యూనిట్లను టాటా కొనుగోలు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment