ఇన్వెస్టర్లు అందరూ అధిక రిస్‌్కకు అనుకూలం కాదు. కొందరు తక్కువ రిస్క్, మోస్తరుకే పరిమితం అవుతుంటారు. అటువంటి వారు ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. తమవద్దనున్న మిగులు నిల్వలను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం. అంటే 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల ఈక్విటీ పెట్టుబడులపై అధిక రాబడులు, డెట్ పెట్టుబడుల రూపంలో రిస్‌్కను తగ్గించే విధంగా ఈ పథకం పనిచేస్తుంది.
రాబడులు
ఈ పథకం రాబడులు అన్ని సమయాల్లోనూ ఈక్విటీ హైబ్రిడ్ విభాగం సగటు రాబడుల కంటే అధికంగానే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 1.58 శాతం నష్టాలను ఇచి్చంది. కానీ, గడిచిన ఏడాది కాలంలో వ్చూర్కెట్లు కూడా రాబడులు ఇవ్వని విషయాన్ని గమనించాలి. మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 13 శాతంగా ఉంది. ఐదేళ్లలో 11 శాతం, ఏడేళ్లలోనూ 11.30 శాతం, పదేళ్లలో 14.42 శాతం చొప్పున రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండేందుకు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, రిస్క్ మధ్యస్థంగా ఉండాల ని భావించే వారికి ఈ పథకం అనుకూలం.
పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల విధానం
ఈక్విటీ, డెట్ కలయికతో ఉన్నందున భిన్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియోను మార్చుకోవడం ఈ పథకం పనితీరులో భాగం. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకం మేనేజర్లు ఈక్విటీల కేటాయింపులను కనిష్టంగా 64 శాతం, గరిష్టంగా 72 శాతం మధ్య నిర్వహించారు. అస్థిరతల సమయాల్లో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుని 10 శాతం వరకు నగదు నిల్వలను ఉంచుకునే వ్యూహాన్ని ఈ పథకం పాటిస్తుంది. ఇప్పుడు కూడా నగదు నిల్వలు 12.45 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో మల్టీక్యాప్ విధానాన్ని పథకం మేనేజర్లు అనుసరిస్తారు. సెపె్టంబర్ 30 నాటికి ఈ పథకం నిర్వహణలో రూ.55,325 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
అంటే ఎంత పెద్ద పథకమో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తంలో ఈక్విటీలకు 68.45 శాతం, డెట్‌కు 19.1 శాతం చొప్పున కేటాయింపులు చేసి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 76 శాతాన్ని లార్జ్‌క్యాప్‌నకు కేటాయించింది. అంటే రిస్క్ చాలా తక్కువే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్‌నకు 23 శాతం కేటాయించగా, అస్థిరతలు ఎక్కువగా ఉండే స్మాల్‌క్యాప్ కేటాయింపులు నిండా ఒక్క శాతం కూడా లేవు. అలాగే, పోర్ట్‌ఫోలియోలో 38 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో 22 శాతం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించగా, హెల్త్‌కేర్ కంపెనీలకు 8.86 శాతం, సేవల రంగ కంపెనీలకు 6 శాతం చొప్పున కేటాయించింది. డెట్‌లో 78 సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఉన్నాయి. దాదాపు 90 శాతం మెరుగైన రేటింగ్ కలిగిన సాధనాలే ఉన్నాయి. ఈ పథకంలో కనీసం రూ.500 నుంచి సిప్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment