
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్స్‌తో ముందుకురానుంది.తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌తో వాట్సాప్ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లకు భారీ ఊరట కల్గనుంది.
ఇకపై అలా వినొచ్చు..!
వాట్సాప్‌లో టెక్ట్స్ మెసేజ్స్‌తో పాటుగా వాయిస్ మెసేజ్స్‌ను కూడా పంపవచ్చుననే విషయం మనందరికీ తెలిసిందే. సదరు యూజరు పంపిన వాయిస్ మెసేజ్‌ను డౌన్‌లోడ్ చేసిన తరువాత ప్లే బటన్ క్లిక్ చేయగానే ఆయా వాయిస్ మెసేజ్‌ను వినగలుగుతాం. ఆయా యూజరు చాట్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆ వాయిస్ మెసేజ్‌ను వినే అవకాశం ఉంది. యూజరు చాట్ నుంచి బ్యాక్ వస్తే...వెంటనే ఆయా వాయిస్ మెసేజ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితిని మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటాం. దీనిని దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ త్వరలోనే గ్లోబల్ ఆడియో ప్లేయర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసురానుంది. ఈ ఫీచర్ సహాయంతో అప్లికేషన్‌లో ఎక్కడైనా వాయిస్ మెసేజ్‌లను వినవచ్చును.
తొలుత వారికే..!
ప్రాథమికంగా ఈ కొత్త ఫీచర్ iOS ప్లాట్‌ఫారమ్‌లోని నిర్దిష్ట బీటా టెస్టర్‌లకు అందించబడుతోంది. తరువాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ తాజా ఫీచర్‌ను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్, WABetaInfo గుర్తించింది. దీంతో పాటుగా వాయిస్ సందేశాలను పాజ్, ప్రివ్యూ వంటి మరిన్ని ఫీచర్లను కూడా వాట్సాప్ జోడించనున్నట్లు సమాచారం.
The global audio player can be used to listen to voice notes wherever you are in the application. It has been recently released to certain iOS beta testers, and it's coming to WhatsApp beta for Android soon. pic.twitter.com/Cvf45CyQ8I
— WABetaInfo (@WABetaInfo) January 29, 2022
చదవండి: వాట్సాప్ యూజర్లకు కొత్త తలనొప్పి..! యాప్‌లో సమస్య..వెంటనే ఇలా చేయండి..!
Comments
Please login to add a commentAdd a comment