
వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో కంటెంట్‌ను రూపొందించే క్రియేటర్ల వ్యవస్థతో భారత ఎకానమీకి గణనీయంగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. 2020లో దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకి రూ. 6,800 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
భారత్‌లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై యూట్యూబ్ ప్రభావాలను మదింపు చేసేందుకు ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ అనే కన్సల్టెన్సీ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
‘ 2020లో స్థూల దేశీయోత్పత్తికి రూ. 6,800 కోట్ల మేర తోడ్పడటంతో పాటు 6,83,900 పైచిలుకు ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సరిసమానమైన కొలువులకు ఊతంగా నిలి్చంది‘ నివేదిక వెల్లడించింది. యూట్యూబ్ ఆధారిత ప్రకటనల ఆదాయాలు, సబ్‌స్క్రిప్షన్ లాంటి ప్రకటనయేతర ఆదాయాలు, స్పాన్సర్‌షిప్‌లు వంటి ఇతరత్రా ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ దీన్ని రూపొందించింది.
చదవండి: మీకిదే నా సలహా..ఇలా చేస్తే జాబ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది!