మారథాన్ వీరుడి మరో ఘనత
చిత్తూరు అర్బన్ : దేశంలో ఎక్కడా మారథాన్ జరిగినా అందులో పాల్గొనే సీఐ రామకృష్ణ తన కెరీర్‌లో మరో మారథాన్ పూర్తి చేశారు. గత ఆదివారం ఢిల్లీలో జరిగిన పూర్తిస్థాయి మారథాన్‌లో పాల్గొన్న ఆయన 3.26 గంటల్లో పరుగును పూర్తి చేశారు. గతేడాది ముంబైలో జరిగిన టాటా మారథాన్‌లో 42.2 కిలోమీటర్ల దూరాన్ని 3.21 గంటల్లో పూర్తి చేసిన ఆయన.. తాజా మారథాన్‌లో 5 నిముషాల నిడివిని తగ్గించి, లక్ష్యాన్ని పూర్తి చేశారు. తన తరువాతి మారథాన్‌ను 3.05 గంటల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. కాగా తిరుపతి పోలీసు శిక్షణ కేంద్రంలో రామకృష్ణ పనిచేస్తున్నారు.
మారథాన్ వీరుడి మరో ఘనత
Comments
Please login to add a commentAdd a comment