గంగాధర నెల్లూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చి1న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జీడీ నెల్లూరు మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జీడి నెల్లూరు హరిజన వాడ, రామానాయుడు పల్లిలో సభా వేదిక, హెలీప్యాడ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు , ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త వెంకటేష్‌తో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ నిర్వహణ, ప్రజా వేదిక, పెన్షన్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక సంబంధిత అంశాలపై చర్చించారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇస్మాయిల్, డీఎస్పీ సాయినాథ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment