సింహ వాహనంపై శివతేజం
బంగారుపాళెం : మొగిలి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం పరమేశ్వరుడైన శ్రీ మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మ వారు మొదట అధికార నంది వాహనాన్ని అధిరోహించి భక్తలకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మ వార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. అనంతరం నంది వాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి ఆదిశంకరుడైన మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మవారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. అభిషే కానంతరం స్వామి, అమ్మ వారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడ వీధుల మీదుగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం మహాశివరాత్రి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం, వృషభ వాహన సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈఓ మునిరాజ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment