3 నుంచి పదో తరగతి గ్రాండ్ టెస్టులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో మార్చి 3వ తేదీ నుంచి పదో తరగతి గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను జారీ చేశారు. ఆ షెడ్యూల్ మేరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో గ్రాండ్‌టెస్ట్‌లు తప్పనిసరిగా నిర్వహించాలని డీఈఓ వరలక్ష్మి ఆదేశించారు. ఈ పరీక్షలు ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంట నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇలా.....
మార్చి–3వ తేదీన మొదటి లాంగ్వేజ్, కాంపోజిట్ కోర్సు, మార్చి 4వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 5న ఇంగ్లీష్, 6న మొదటి లాంగ్వేజ్ పేపర్ (కాంపొజిట్‌కోర్సు), 7న గణితం, 10న ఫిజికల్ సైన్స్, 11న బయాలజికల్ సైన్స్, 12న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2, ఒకేషనల్ కోర్స్ థియరీ, 13న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
చెరకు తోట దగ్ధం
వెదురుకుప్పం : మండలంలోని యనమలమంద గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు నీలకంఠానికి చెందిన చెరకు తోట దగ్ధమైంది. మంగళవారం సాయంత్రం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించిందని బాధిత రైతు తెలిపారు. నాలుగెకరాల్లో చెరకు పంట కాలిబూడిద అయినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment