చిత్తూరు కార్పొరేషన్ : తుక్కు అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని సీటీ(వాణిజ్య పన్నుల)శాఖ జేసీ (సంయుక్త కమిషనర్) జాన్ స్టీవెన్‌సన్ బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా గతంలో మొత్తం 13 వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన విషయం తెలిసిందేనన్నారు. మరికొన్ని వ్యాపార సంస్థలను తనిఖీ చేసి భారీ మొత్తంలో జరిమానా విధించామన్నారు. రద్దయిన 13 సంస్థలకు సంబంధించిన అక్రమ రవాణాకు సూత్రధారిగా అనుమానిస్తున్న కట్టమంచిలోని వ్యాపార సంస్థపై మంగళవారం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిత్తూరు ఏసీ–1 శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారన్నారు. ఆ సంస్థ కార్యాలయంలో పత్రాలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అక్రమ లావాదేవీలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment