చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మసీదుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. నగరం, పట్టణాలు, గ్రామాల్లో మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తెల్లవారుజామున ము స్లింలు మసీదులకు వెళ్లి నమాజ్ చేసుకుంటారని ఆ సమయంలో విద్యుత్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
జాతీయ సైన్స్‌డే పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 28న జాతీయ సైన్స్ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ పోటీల నిర్వహణకు జిల్లాకు రూ.50 వేలు మంజూరు చేశారు. వికసిత్ భారత్ కోసం ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం అనే అంశంపై విద్యార్థులకు క్విజ్, సెమినార్‌లు నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment