అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అబద్దాలు
● వైఎస్సార్‌సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి ఆగ్రహం
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజాసమస్యలపై చర్చించాల్సిన అ సెంబ్లీలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌నాయు డు అబద్దపు మాటలు వల్లెవేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘మా నాయకుడు జగనన్నపై వ్యంగాస్త్రాలు వేసే స్థాయి గురజాలది కాదన్నారు. ప్రతిపక్ష హోదాపై గవర్నర్‌ను బెదిరిస్తున్నామంటున్నారు.. గతంలో బీజేపీకి 3 సీట్లు వస్తే ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి, ఈవీఎంల మాయతో ఎమ్మెల్యేగా గెలిచిన గురజాలకు ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. కూట మి పాలనలో జిల్లా మొత్తానికి కలిపి 36 ఆర్టీసీ బస్సులు వ స్తే.. ఇందులో చిత్తూరుకు మాత్రం నాలుగు బస్సులు వచ్చాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చి త్తూరుకే 21 బస్సులు తెచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడొచ్చిన 36 బస్సులు కూడా తమ ప్రభుత్వ హయంలో మంజూరు చేసినవేనని స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టు 15 నుంచి మహిళల కు ఉచిత బస్సు అంటూ చిత్తూరులో ప్రచారం చేసుకున్న గురజాల ఇప్పటికీ దాన్ని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని విజయానందరెడ్డి నిలదీశారు.
ఆ మద్యం బ్రాండ్లు మీవే..
ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్‌బూమ్ లాంటి మద్యం బ్రాండ్లు టీడీపీ పాలనలో వచ్చినేవని.. వీటి అనుమతులు కూడా టీడీపీనే ఇచ్చిందన్నారు. మద్యం అక్రమ కేసుల్లో తమ పార్టీ ముఖ్యనేతలు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి, నారాయణస్వామి పేర్లు చెప్పాలని ఎకై ్సజ్ ఉన్నతాధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌కు కూటమి నేతలు వేధించడం నిజం కాదా అని ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జర్మనీలో ఉన్న కుమారై వద్దకు వెలితే, మాజీ మంత్రి విదేశాలకు పారిపోయారని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపాల అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు గాయత్రీదేవి, జ్ఞానజగదీష్, రజనీకాంత్, అంజలిరెడ్డి, ముత్తు, శేఖర్, హరీషారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, స్టాన్లీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment