● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు కరువు ● కోర్సులు
ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య ఎంతో కీలకం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధి పై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా విద్యార్థుల ఉజ్వల భ విష్యత్తు అంధకారం నెలకొంటోది. జిల్లా వ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన ప్రభు త్వ డిగ్రీ కళాశాలలు నాక్ ఉత్తమ గ్రేడ్‌లను సాధిస్తున్నాయి. కానీ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, అధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల వైపు విద్యార్థులు ఆస్తకి కనబరుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యారంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. గత ఐదేళ్ల పాటు వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు దీటుగా ప్రవేశాలు కల్పిస్తూ ఫ్యూచర్ రెడీనెస్ కాన్సెప్ట్ తో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్ది కొత్త ఒరవడిని సృష్టించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. ఫలితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెనుకబడిపోతున్నాయి.
అయిదేళ్లకు ముందు అందరికీ చిన్నచూపే..
వైఎస్సార్‌సీపీ సర్కారు అధికారంలోకి రాకముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలంటే అందరికీ చిన్నచూపే. పాతికేళ్ల కిందట ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి దైన్యస్థితికి చేరాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు డిగ్రీ కళాశాలల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో భవనాల మరమ్మతులు, సరైన సౌకర్యాలు లేని తరగతి గదులు, పనికిరాని లేబొరేటరీలు , తాగునీటి సమస్యలు, ముఖ్యమైన బోధనా అధ్యాపకుల కొరత వేధిస్తోంది.
కాంట్రాక్ట్ లెక్చరర్లే దిక్కు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు, గెస్టు లెక్చరర్ల తోనే బోధన సాగిస్తున్నారు. ఇదే అదునుగా మార్చుకున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నిష్ణాతులైన అధ్యాపకులను నియమించుకుంటున్నాయి. క్రమేణా ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటున్నారు. దీంతో ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. రెగ్యులర్ పోస్టు లు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. ఉద్యోగోన్నతులు లేకపోవడం, కొత్త నియామకాలు లేకపోవడంతో ఏటా కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లను నియమించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.
కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల
వేధిస్తున్న అధ్యాపకుల కొరత..
ప్రభుత్వ కళాశాలపై చిన్నచూపు తగదు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలపై రా ష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో భర్తీ కాని పోస్టులను కూటమి ప్రభు త్వం వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలి. ఎన్నో ఆశలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పేద విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉంది. ఈ కళాశాలలో అధిక సంఖ్యలో అధ్యాపకుల కొరత ఉంది. కూటమి ప్రభు త్వం విద్యాభివృద్ధికి ఏం చేస్తోందో తెలియజేయాలి.
– శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి
రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలి
జిల్లా వ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. అయితే వీటిలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులను వెంటనే నియమించాలి. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోతే పేద విద్యార్థులు ఎలా విద్యను కొనసాగించాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో క్వాలిఫైడ్ లెక్చరర్‌లు ఉండడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ వైపు మక్కువ చూపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలి.
– పవన్, ఏబీవీపీ సంఘం చిత్తూరు బాగ్ కన్వీనర్
జిల్లా సమాచారం
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: 18
నాక్ ఏ ప్లస్ డిగ్రీ కళాశాలలు:
నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల
చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల
ఉండాల్సిన రెగ్యులర్ అధ్యాపకులు: 1678
విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు: 748
భర్తీ చేయాల్సిన రెగ్యులర్ పోస్టులు: 930
విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు: 15,300
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీలు చేయకపోవడంతో కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలతో కాలం నెట్టుకొస్తున్నారు.
ఇటీవల నాక్ ఏ గ్రేడ్ వచ్చిన ఎంతో చరిత్ర కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 65 మంది రెగ్యులర్ అధ్యాపకులకు ప్రస్తు తం 18 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తు న్నారు. మిగిలిన 47 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సి ఉంది. అదే విఽ దంగా నాన్‌న్‌టీచింగ్ స్టాఫ్ 53 మందికి గా ను 23 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 30 పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు.
చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 35 మంది రెగ్యులర్ అధ్యాపకులకు గాను 16 మంది విధు లు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 29 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ ప్లస్ హోదా ఉంది. ఈ కళాశాలలో 34 మంది అధ్యాపకులకు గాను 21 మంది రెగ్యులర్‌గా ఉన్నారు. మిగిలిన 13 మంది కాంట్రాక్టు, గెస్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీ ప్లస్ ప్లస్ నాక్ హోదా ఉంది. ఈ కళాశాలలో 15 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా 6 మంది మాత్రమే రెగ్యులర్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాల్సి ఉంది.
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు కరువు ● కోర్సులు
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు కరువు ● కోర్సులు
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు కరువు ● కోర్సులు
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు కరువు ● కోర్సులు
Comments
Please login to add a commentAdd a comment