ముసుగు దొంగల హల్‌చల్
చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీలో ముసుగు ధరించిన నలుగురు దొంగలు శుక్ర వారం అర్ధరాత్రి హల్‌చల్ చేశారు.
కుప్పం టౌన్ బ్యాంకుపై ఆంక్షలు తొలగింపు
కుప్పం : కుప్పం కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో గతంలో రిజర్వు బ్యాంకు విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు మేనేజర్ శివక్రిష్ణ తెలిపారు. 2020లో టౌన్ బ్యాంకులో జరిగిన అవకతవకలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రుణాలు, షేర్ హోల్డర్లకు డివిడెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వడ్డీ ఇవ్వాలని ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి టౌన్ బ్యాంకులో ఎలాంటి రుణాలు, షేర్ హోల్డర్లకు డివిడెంట్లు నిలిపివేశారు. ప్రస్తుతం ఆంక్షలు తొలగిస్తూ మార్చి 2025 నుంచి అన్ని విధాలా సేవలను పునరుద్ధరించాలని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా
చిత్తూరు అర్బన్ : చిత్తూరుకు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) వి.లోకనాథరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను ఈ పోస్టులో కొనసాగలేనని, మార్చి 1వ తేదీ నుంచి ఏపీపీగా విధులకు హాజరుకాలేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్స్‌పల్ కార్యదర్శికి తన రాజీనామా లేఖను పంపించారు.
క్రీడాకారులకు డీఈఓ అభినందన
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటిన జిల్లా సర్కారు పాఠశాల విద్యార్థులను డీఈఓ వరలక్ష్మి అభినందించారు. ఆ విద్యార్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ.. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించిన విద్యార్థుల ప్రతిభ అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి క్రీడల్లో మరింత రాణించాలన్నారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థులకు డీఈఓ సర్టిఫికెట్‌లు, పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో పీడీలు రవి, కృష్ణ, దాము, హరికృష్ణ పాల్గొన్నారు.
8న మహిళా సదస్సు
చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు సాహిత్య, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన మహిళా సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సమితి నిర్వాహకులు తులసీనాథం నాయుడు తెలిపా రు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరులోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కళా మందిరంలో మహిళా సదస్సు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీసమాజాభివృద్ధి మహిళలుశ్రీ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సుతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 25 మంది మహిళలకు ఉత్తమ మహిళా పురస్కారాలు అందిస్తామని వెల్లడించారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment