గురుకులాన్ని తనిఖీ చేసిన విజిలెన్స్
పుంగనూరు : పట్టణంలోని మేలుపట్లలోని ఎస్సీ, ఎస్టీ గురు కుల పాఠశాలను శనివారం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ సభ్యులు డాక్టర్ బాణావత్ మునీంద్రనాయక్, నాగేనాయక్ పాఠశాలను తనిఖీ చేశారు. వి ద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ పార్వతితో చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీంద్రనాయక్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, పలు రకాల సమస్యలు ఉన్నాయని , వీటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సభ్యులు రామయ్యనాయక్, శ్రీరాములునాయక్, చిన్నరాయుడు, జిటినారాయణ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment