
సాక్షి, వికారాబాద్: జిల్లా తాండూరు కాగ్నానది వద్ద విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపైన ఉన్న గుంతను తప్పించబోయి పక్కనే ఉన్న నదిలోకి కారు దూసుకేళ్లిన ఘటన మంగళవారం వికారాబాద్‌లో జరిగింది. ఈ ఘటన కారు డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు బాధితుడిని కాపాడలేకపోయారు. సదరు మృతుడిని యాలాల మండల వాసిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment