ఆధారాలు లేకుండా రూ.52లక్షలు తరలిస్తూ చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారులు
సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసిన పోలీసులు
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీ సిబ్బందిపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన నగరంలోని సీతంపేట మార్గదర్శి చిట్‌ఫండ్స్ శాఖ అకౌంట్ అసిస్టెంట్ వి.లక్ష్మణరావు, ఆఫీస్ బాయ్ శ్రీను స్కూటీలో రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,677 విలువైన 51 చెక్కులు తీసుకువెళ్తుండగా.. ద్వారకానగర్ మొదటి లైన్‌లో పోలీసులు తనిఖీలు చేస్తూ పట్టుకున్నారు.
పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. దీనిపై ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 188 ప్రకారం మార్గదర్శి సిబ్బంది వి.లక్ష్మణరావు, శ్రీనులపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లడానికి వీలులేదని ద్వారకా సీఐ ఎస్.రమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment