
మైసూరు: క్షణికావేశంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని కృష్ణాపుర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న చంద్రశేఖర్ (30), కవిత (20)కు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఇటీవల కొన్ని రోజులుగా దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు ఏర్పడ్డాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు ఘర్షణపడ్డారు. దీంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నంజనగూడు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.