
సాక్షి, లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో తార్నాక ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓయూ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తార్నాక నుంచి ఎర్రకుంటకు వెళ్లే మార్గంలో మంగళవారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు డ్రగ్స్, గంజాయి, హాష్ అయిల్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నార్కొటిక్ సిబ్బంది, ఓయూ పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు విక్రయదారులు కాగా మిగతా వారు వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి గంజాయి, హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment