ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,పెనమలూరు: ఇంటర్ చదువుతున్న బాలికతో(17) పరిచయం పెంచుకుని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడి చేసిన యువకుడు, అతనికి సహకరించిన మరి కొందరు యువకులపై పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. కానూరు గుమ్మడితోటకు చెందిన బాలిక తల్లిదండ్రులు విడిపోవటంతో మేనమామ ఇంట్లో ఉంటూ విజయవాడలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఫేస్‌బుక్‌లో బాబీ, గోవిందు, నిఖిల్, బుజ్జి, అవినాష్‌తో పరిచయం ఏర్పడింది.
అయితే విజయవాడ పటమటలో నివాసం ఉండే గోవిందు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికను కానూరులో బాబీ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన తరువాత బాలిక తనను మోసం చేయవద్దని పెళ్లి చేసుకోవాలని గోవిందును కోరింది. దీంతో గోవిందుతో పాటు అతని మిత్రులు తమ వద్ద ఫొటోలు ఉన్నాయని, అవి బయటపెడతామని బాలికలను బెదిరించసాగారు. దీంతో బాలిక పెనమలూరు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు గోవిందుతో పాటు అతని మిత్రులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
చదవండి: ప్రియుడి నాటకంతో శానిటైజర్ తాగి ప్రియురాలి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment