![In Madakashira, Anantapur Volunteer Was Attacked By Thieves - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/1/2.jpg.webp?itok=vm7nfN2w)
బాధితుడు
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిరలో దోపిడీ దొంగలు గురువారం ఉదయం బీభత్సం సృష్టించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా వలంటీర్ పై దాడి చేసి నగదును లాక్కెళ్లారు. వలంటీర్ వీరప్ప కళ్లలో కారం కొట్టి దుండగులు 43 వేల రూపాయలను అపహరించారు. మడకశిర పట్టణంలోని శివపురలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను వెంటనే పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వృద్ధులకు ఆసరా అందించే పింఛన్ల డబ్బును దోచుకోవడానికి మనసెలా వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. దొంగలను పట్టుకుని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దోపిడీ నేపథ్యంలో పింఛన్లు పంపిణీ చేసే వలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. (చదవండి: వీడిన మిస్టరీ: ఒంటరి మహిళపై కన్నేసి.. )
Comments
Please login to add a commentAdd a comment