నాగోలు: ఆన్‌లైన్ రమ్మీ ఆటలకు బానిసై పనిచేస్తున్న సంస్థను మోసం చేసి దాదాపు రూ.50 లక్షలు నగదు తీసుకెళ్లిన వ్యక్తితో పాటు మరో ఇద్దని హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి దాదాపు రూ.28 లక్షల నగదు, 3 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు తెలిపారు.
హయత్‌నగర్ పెద్ద అంబర్‌పేట సమీపంలో ఉన్న జేబీ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన నీలాపు నవీన్‌రెడ్డి(28) పెద్ద అంబర్‌పేటలోని జేబీ ఇన్‌ఫ్రాలో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్. ఆన్‌లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. స్నేహితుల వద్ద అప్పలు చేశాడు. మార్చి 23వ తేదీన కంపెనీకి చెందిన రూ.50.57 లక్షల నగదును నవీన్‌రెడ్డి ఇచ్చి మరుసటి రోజు తీసుకుంటామని చెప్పారు. కంపెనీ వారు ఫోన్ చేయడంతో మామ అమిత్‌రెడ్డి, రామకృష్ణతో కలసి కోల్‌కతా, భువనేశ్వర్ వెళ్లి డబ్బులతో జల్సాలు చేశారు.
కంపెనీ నిర్వాహకులు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి గురువారం ముగ్గురి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్ధలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్ సీఐ సురేందర్, ఎస్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.
( చదవండి: యువతికి చుక్కలు చూపించిన ‘మైనర్’.. )
Comments
Please login to add a commentAdd a comment