రాజు (ఫైల్)
పటాన్‌చెరు టౌన్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి తల, మొండెంను వేర్వేరు చోట్ల పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. హైదరాబాద్ శివారులోని రామచంద్రాపురం వెలిమెల తండాకు చెందిన కేడావత్ రాజు నాయక్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. రాయికోడ్ మండలం కుస్నూర్ శివారులోని వాగు వద్ద తల, న్యాల్‌కల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జి పరిసరాల్లో మొం డెం గుర్తించారు. పటాన్‌చెరు డీఎస్పీ భీం నాయ క్ కేసును పరిశోధిస్తున్నారు. రాజునాయక్ తల, మొండెం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇంద్రకరణ్ స్టేషన్ పరిధిలోనే హత్య!
రాజునాయక్‌ను కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. రాజునాయక్ ఈ నెల 25న రాత్రి ఓ ఫోన్ కాల్ వస్తే ఇంటి నుంచి కారులో బయటికెళ్లాడు. అదే రాత్రి రాజునాయక్ అదృశ్యంపై అతని సోదరుడు గోపాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రామచంద్రాపురం మండలం వెలిమెల తండాకు చెందిన మృతుడు కేడవత్ రాజునాయక్ (32) ఎర్ర మట్టి వ్యాపారం చేస్తుంటాడు.
ఆయన టీఆర్‌ఎస్ మండల ఎస్టీ విభాగం అధ్యక్షునిగా కూడా పని చేస్తున్నాడు. 32 గుంటల భూమి వివాదమే రాజునాయక్ హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం. నిందితుల్లో మృతుని తమ్ముడు గోపాల్ నాయక్ కూడా ఉన్నాడు. భూ వివాదానికి కారణమైన రాంసింగ్ నాయక్‌తో పాటు గ్రామానికి చెందిన మహేష్, బాలు, మల్లేష్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment